న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్(Sarfaraz Khan) ఆటపై మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే(Anil Kumble) ప్రశంసలు కురిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై ప్రేక్షకులను నిరాశపెట్టిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసి అదరగొట్టింది. సర్ఫరాజ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసి కివీస్ బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ మ్యాచ్ సర్ఫరాజ్‌కు ఒక మైలురాయిలా మిగలనుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్‌తోనేర సర్ఫరాజ్ తన తొలి అంతర్జాతీయ శతకం సాధించాడు. మూడు రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులు చేసిన సర్ఫరాజ్.. నాలుగో రోజు ఆటలోనే సెంచరీ సాధించాడు. కానీ ఈ రోజు తన ఆటతీరుతో సర్ఫరాజ్.. కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడని, తీవ్ర ఒత్తిడి చేశాడని సీనియర్ ఆటగాడు అనిల్ కుంబ్లే ప్రశంసించాడు.
‘‘ప్రత్యర్థి బౌలర్లపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సర్ఫరాజ్(Sarfaraz Khan)కు బాగా తెలుసు. అతడు ఒక్క సరీసే ఆడాడని గుర్తుంచుకోవాలి. టీమ్ పరిస్థితిని బట్టి.. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని. అలాంటి సమయంలో బ్యాటింగ్‌కు దిగి కూడా బౌలర్లను నియంత్రించడానికి ప్రయత్నించాడు. ఆరంభం నుంచే స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చూపాడు. పేస్ బౌలింగ్‌లో కూడా సర్ఫరాజ్ చాలా నిలకడగా ఆడి కివీస్ బౌలర్లపై ఒత్తిడిని పెంచాడు’’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.