ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత ప్లేయర్లు చరిత్ర సృష్టించారు. 58ఏళ్ల తర్వాత సాత్విక్-చిరాగ్ జోడి పసిడి సాధించింది. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా విజేతగా నిలిచి భారత్‌కు తొలిసారి పసిడి పతకం అందించాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఏపీకి చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు. 16–21, 21–17, 21–19 పాయింట్ తేడాతో ఒంగ్ యె సిన్–తియో జో యి జోడీపై విజయం సాధించారు. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పారు.
ఈ అద్భుత విజయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్-2023లో విజేతలుగా నిలిచినందుకు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ లకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. అద్భుత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సాత్విక్ ఆట పట్ల గర్విస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు జాతి కీర్తిపతాకం గర్వంగా ఎగురుతోందని పేర్కొన్నారు.
My congratulations to @satwiksairaj and Chirag on winning the Badminton Asia Championships 2023.
I’m incredibly proud of Satwik, who hails from our beautiful #AndhraPradesh.
The Telugu Flag continues to fly higher!— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2023