ఐపీఎల్ చరిత్రలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డు

-

క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓ మ్యాచులో హీరోగా నిలిచిన ఆటగాడు మరో మ్యాచులో జీరో అయిపోతాడు. బంతి బంతికి లెక్కలు మారే ఈ ఆటలో నిలకడగా ఆడే ఆటగాళ్లకే ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా ఈ కోవలోకి భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) వచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్ తొలి రెండు మ్యాచుల్లో తన ఆట తీరుతో శభాష్ అనిపించాడు.

- Advertisement -

అయితే శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్(Punjab Kings) తో జరిగిన మ్యాచులో మాత్రం తేలిపోయాడు. మొదటి రెండు ఓవర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన అర్జున్(Arjun Tendulkar).. మూడవ ఓవర్లో మాత్రం ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా మూడవ స్థానంలో నిలిచాడు. గతంలో డేనియల్ సామ్స్ 35 పరుగులు, హర్షల్ పటేల్ 37 పరుగులు ఒకే ఓవర్లో సమర్పించుకున్నారు. ఇప్పుడు వారి సరసన అర్జున్ టెండూల్కర్ స్థానం దక్కించుకున్నాడు.

Read Also: సర్ జడ్డూకి కోపం వచ్చింది.. క్లాసెన్ తో వాగ్వాదం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...