Asia Cup 2023 |క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది. ఆసియా కప్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా? అని ఎదరుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఏకంగా షెడ్యూల్ ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ టోర్నీని రెండు దేశాల్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈసారి ఆసియా కప్ పాకిస్థాన్, శ్రీలంకలో జరగనుంది. టోర్నమెంట్ ఆగస్టు 31న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఆసియా కప్(Asia Cup 2023) హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్(Pakistan)లో 4 మ్యాచ్‌లు, శ్రీలంక(Sri Lanka)లో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి టోర్నీ రెండు గ్రూపులుగా జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమాచారం. రెండు గ్రూపుల నుంచి తలో 2 జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. సూపర్-4 రౌండ్‌లో టాప్ 2 జట్లు ఫైనల్‌లో తలపడతాయి. అంతేగాక, ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది. ప్రపంచ కప్ సన్నాహక పరంగా అన్ని ఆసియా జట్లకు ఆసియా కప్ చాలా ముఖ్యమైన టోర్నమెంట్. ఈ టోర్నీలో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు కూడా ఆడనున్నాయి.
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచులు!
-