ఆసియా కప్(Asia Cup)లో ఆడుతున్న నేపాల్ జట్టుకు ఓ బీర్ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ క్రికెట్ జట్టును ప్రోత్సహించేందుకు అర్ణ బీర్ కంపెనీ ముందుకొచ్చింది. నేడు టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ ఆటగాళ్లు తీసే ప్రతి వికెట్‌కు రూ.లక్ష నజరానా ఇస్తామని కీలక ప్రకటన చేసింది. అలాగే ఒక్కో సిక్సర్‌కు రూ.లక్ష బహుమతి, ఫోర్ కొడితే రూ.25వేలు నజరానాగా ఇస్తామని తెలిపింది. దీంతో నేపాల్ వికెట్, బౌండరీలు కొట్టే ఆటగాళ్లకు భారీ ప్రోత్సహకాలు అందనున్నాయి. ఇప్పటికే బ్యాటింగ్ ఆడుతున్న నేపాల్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డు పరిగెత్తిస్తున్నారు.
టోర్నీ(Asia Cup)లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్ భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ జట్టు దారుణంగా విఫలమైంది. పాక్ బౌలర్లు విజృంభించడంతో 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. మరోవైపు టీమిండియా-నేపాల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు పాక్‌తో ఆడిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని రోహిత్ సేన ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో నేపాల్ గెలిస్తే టీమిండియా ఇంటికి వెళ్లాల్సిందే. అందుకే తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఇలా నజరానా ప్రకటించినట్లు అర్ణ బీర్ కంపెనీ అభిప్రాయపడింది.