Flash: చిక్కుల్లో బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్

0
139

ఇప్పటికే పలుమార్లు చిక్కుల్లో పడ్డ బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్‌ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఒక బెట్టింగ్‌ వెబ్‌సైట్‌తో కాంట్రాక్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని షకీబ్‌.. ”బెట్‌ విన్నర్‌ న్యూస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నా” అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఫోటోను షేర్‌ చేశాడు. తన కాంట్రాక్ట్‌ ఒప్పందం విషయమై షకీబ్‌ బీసీబీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడతన్ని కష్టాల్లోకి నెట్టింది.