BCCI Announces New Senior Selection Committee for men’s team: సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన BCCI క్రికెట్ సలహా కమిటీ (CAC) శనివారం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. నవంబర్ 18, 2022న బీసీసీఐ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేసిన ఐదు పోస్టుల కోసం ప్రకటన తర్వాత దాదాపు 600 దరఖాస్తులను స్వీకరించింది. సుదీర్ఘ పరిశీలన చర్చల అనంతరం సిఏసి 11 మందిని వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం సెలెక్ట్ చేసింది. ఇంటర్వ్యూల ఆధారంగా సీఏసీ చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ తో కూడిన సీనియర్ సెలక్షన్ కమిటీని సిఫార్సు చేసింది. సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ గా చేతన్ శర్మను సీఏసీ ఫైనల్ చేసింది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డిసెంబర్‌లో ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీ (CAC)ని నియమించింది, ఇందులో మాజీ భారత క్రికెటర్లు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేతో పాటు సులక్షణ నాయక్ లు సీనియర్ సెలక్షన్ కమిటీని ఎన్నుకున్నారు.