రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నోసూపర్ జెయింట్స్ మధ్య మ్యాచులో వాగ్వాదానికి దిగిన విరాట్ కోహ్లి, గంభీర్(Kohli Gambhir)లకు భారీ జరిమానా పడింది. ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి మ్యాచ్ ఫీజులో లెవల్ 2 నేరం కింద రిఫరీ 100 శాతం జరిమానా విధించాడు. మ్యాచ్‌కు రూ.1.07 కోట్ల చొప్పున ఫీజు అందుకుంటుండగా.. మెంటార్‌గా గంభీర్ మ్యాచ్‌కు రూ.25 లక్షలు అందుకుంటున్నాడు. దీంతో వీరిద్దరు పూర్తి మ్యాచ్ ఫీజు జరిమానాగా కట్టాల్సి వచ్చింది.
Kohli Gambhir |వీరితో పాటు కోహ్లితో గొడవ పడిన లక్నో ఆటగాడు నవీనుల్ హక్‌కు కూడా లెవల్1 నేరం కింద ఫీజులో 50 శాతం కోత విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. కాగా రెండ్రోజుల క్రితం జరిగిన ఇరు జట్ల మ్యాచ్ అనంతరం కోహ్లితో లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్ మాట్లాడుతుండగా.. గంభీర్ అతడిని పక్కకు లాక్కెళ్లడంతో గొడవ మొదలైంది. మ్యాచ్‌లో నవీనుల్ ఔటైనపుడు విరాట్ తన బూట్‌ను చూపిస్తూ ఏదో అన్నాడు. ఇక అక్కడి నుంచి గొడవ జరుగుతూనే ఉంది.
Read Also: ’ఏజెంట్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్
Follow us on: Google News, Koo, Twitter