హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

-

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ ఈ వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా సారథ్య బాధ్యతలను హర్మన్ ప్రీత్ కౌర్‌(Harmanpreet Kaur)కు అప్పగించారు. 16 మందితో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ 2024లో లీగ్ దశ నుంచే టీమిండియా ఇంటిబాట పట్టింది. కానీ మరోసారి జట్టు సారథ్య బాధ్యతలను హర్మన్‌ప్రీత్‌కే ఇవ్వడానికి సెలక్టర్లు సందేహించలేదు. ఇదే హర్మన్‌పై వారికున్న నమ్మకాన్ని చూపుతుంది. కివీస్‌తో తలపడే జట్టుకు స్మృతి మందాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కాగా ఈ జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది.

- Advertisement -

Harmanpreet Kaur | ఇంటర్‌మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డు పరీక్షలు ఉండటంతో టీమిండియా జట్టులో వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు స్థానం దక్కలేదు. ఆల్‌రౌండర్ పూజ ప్రస్తాకర్‌కు విశ్రాంతి ఇచ్చారు సెలక్టర్లు. ఆశ శోభనకు గాయం కావడంతో జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్-ఎ జట్టు నుంచి తేజల్ హస్నాబిస్, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రాలకు ఈసారి న్యూజిలాండ్‌తో తలపడే జట్టులో స్థానం దక్కింది. మహిళల ఐపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్‌కు జాతీయ జట్టులో స్థానం దక్కింది. ఈనెల 24, 27, 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.

Read Also: బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...