టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్(Gautam Gambhir)కు ఇచ్చిన పవర్స్‌కు కత్తెర వేయాలని బీసీసీఐ చూస్తోందని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. అందుకు గంభీర్ కోచ్‌గా మారిన తర్వాత టీమిండియా సక్సెస్ రేట్‌లో వచ్చిన మార్పులే కారణం. భారీ అంచనాలతో గంభీర్‌కు హెడ్ కోచ్ పదవిని కట్టబెట్టింది బీసీసీఐ(BCCI). గంభీర్ కోచ్‌గా ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లను కూడా సొంతం చేసుకోవాలని ప్లాన్స్ చేసింది బీసీసీఐ. కానీ ఇప్పుడు చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ కాదు కదా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడమే పెద్ద యుద్ధంలా మారింది. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ గెలిచింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. అదే విధంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను గెలిచిన భారత్.. కివీస్ చేతిలో మాత్రం చిత్తయింది. టెస్ట్‌లలో భారత్ వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో కూడా టీమిండియా అంతంత మాత్రంగానే ఆడితే గంభీర్‌కు ఇచ్చిన స్పెషల్ పవర్స్‌కు కత్తెర వేయాలని బీసీసీఐ యోచిస్తుందట.
‘‘గంభీర్‌కు బీసీసీఐ చాలా మినహాయింపులు ఇచ్చింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం జట్టు ఎంపిక ప్రక్రియలో హెడ్ కోచ్ పాల్గొనడు. కానీ గంభీర్‌కు ఆ వెసులుబాటు కల్పించింది. జట్టు ఎంపికను పూర్తిగా గంభీర్‌కు వదిలేసింది బీసీసీఐ. ఆస్ట్రేలియా పర్యటన కోసం జరిగిన సమావేశంలో గంభీర్‌కు బీసీసీఐ ఈ రూల్‌ను మినహాయించింది. ప్రధాన కోచ్‌గా టీమ్‌కు కావాల్సిన ఆటగాళ్ల విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి గంభీర్‌ను అనుమతించింది. కానీ కంగారులతో జరిగే సిరీస్‌ను గెలిచి డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్స్‌కు చేరకపోతే మాత్రం గంభీర్(Gautam Gambhir) తన అధికారాల్లో కోతను తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మరి కాంగారులతో సిరీస్‌ను కూడా భారత్ కంగారు పడి చేజార్చుకుంటుండా.. లేదా అదరగొట్టి గట్టెక్కుతుందా అనేది చూడాలి.