ప్రస్తుతం ఐపీఎల్ గురించి ఎక్కడ చర్చ వచ్చినా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) గురించే. అసలు ఆ ఆట ఏంటి.. ఆ కొట్టుడు ఏంటి.. ఆ పరుగులు ఏంటిరా బాబూ అని తెగ చర్చించుకుంటున్నారు. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఈ కుర్రాడు బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఎంతలా అంటే ఐపీఎల్(IPL) చరిత్రలోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ(13 బంతుల్లో) చేశాడు. అంతేకాకుండా ఇన్నింగ్స్ తొలి ఓవర్లలో ఏకంగా 26పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. తన థనాథన్ ఆటతీరుతో ఈ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానంలో(575 పరుగులు) ఉన్నాడు. ఇక ఈ సీజన్‌లో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఏకైక ఆటగాడిగానూ నిలిచాడు.
యశస్వి(Yashasvi Jaiswal) బ్యాటింగ్ కు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అయితే ముగ్ధులైపోతున్నా. సూపర్ పెర్ఫామెరెన్స్ అంటూ కొనియాడుతున్నారు. అతడి ఆట అద్భుతం.. టీమ్‌ఇండియాలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తన ఆటతీరుపై యశస్వి స్పందిస్తూ ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ నీలాంటి దిగ్గజాలే తనకు స్ఫూర్తి అని తెలిపాడు. అన్ని విషయాలు వారి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపాడు.
Read Also: వేసవిలో సింపుల్ స్కిన్ కేర్ టిప్స్
Follow us on: Google News, Koo, Twitter