ముగిసిన యూఎస్ ఓపెన్.. విజయం బెలారస్ భామ సొంతం..

-

యూఎస్ ఓపెన్స్‌లో మహిళల ఛాంపియన్ షిప్ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బెలారస్‌ భామ అరీనా సబలెంక(Aryna Sabalenka) విజయం సాధించింది. ఫైనల్‌లో అమెరికా ప్లేయర్ పెగులాతో జరిగిన పోరులో సబలెంక.. 7-5, 7-5 తేడాతో విజయకేతం ఎగరవేసింది. దీంతో సబలెంక తన కెరీర్ తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ విజయం తన జీవితంలో ఓ కీలకమైన మైలురాయి అవుతుందని సబలెంక చెప్పుకొచ్చింది. పెగులా అద్భుతమైన క్రీడాకారిణి అని తన ప్రత్యర్థిని మెచ్చుకుంది సబలెంక.

- Advertisement -

ఇదిలా ఉంటే ప్రపంచ నెంబర్ 2 ర్యాంక్‌లో ఉన్న సబలెంక గతంలో కూడా యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరింది. కానీ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అప్పట్లో కోకో గాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో సబలెంక(Aryna Sabalenka) ఓటమిపాలైంది. ఇప్పుడు ఈ యూఎస్ ఓపెన్‌ను గెలిచి తన గ్రాండ్ స్లామ్‌ల సంఖ్యను మూడుకు చేర్చుకుంది.

Read Also: అల్లంతో అదరగొట్టే ఆరోగ్య ప్రయోజనాలు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KCR | కాంగ్రెస్ పై కేసీఆర్ సమర శంఖారావం.. ఆ వేదిక నుంచే!

BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...

Stress Free Life | ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు

Stress Free Life | 1.లోతైన శ్వాస సంబంధిత వ్యాయామాలు...