Ben Stokes donates his test series match fee to Pak flood relief fund: పాకిస్థాన్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ స్టార్ బెన్ స్టోక్స్ భారీ విరాళం ప్రకటించాడు. డిసెంబర్ 1 నుంచి ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందుకుసోం ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే పాకిస్థాన్ చేరుకొని, ప్రాక్టీస్ మెుదలుపెట్టింది. ఈ టెస్టు సిరీస్ ద్వారా వచ్చే తన మ్యాచ్ ఫీజు మెుత్తాన్ని పాకిస్థాన్ ఈ ఏడాది వరద బాధితులకు అందజేయనున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. వరద కారణంగా దెబ్బతిన్న నగరాల పునఃనిర్మాణం కోసం వాడుకోవాలని బెన్ ట్వీట్ చేశాడు. ఈ విపత్తు పాక్ ప్రజల జీవనాన్ని, దేశ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్ తన జీవితానికి కావాల్సింది ఇచ్చిందనీ.. వాటిని తిరిగి ఇవ్వటం సరైందని తన భావన అని అన్నాడు. అందుకే, ఈ టెస్ట్ సిరీస్ ద్వారా తనకు లభించే మ్యాచ్ ఫీజును పాక్ వరద బాధిత సహాయ కేంద్రానికి అందజేయానికి నిర్ణయించుకున్నట్లు బెన్ (Ben Stokes) తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. బెన్ నిర్ణయంతో పాకిస్థాన్ దేశీయుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️?? pic.twitter.com/BgvY0VQ2GG
— Ben Stokes (@benstokes38) November 28, 2022