Paris Olympics | పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని, షూటింగ్‌లో పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా మను భాకర్(Manu Bhaker) నిలిచారు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో ఆమె 221 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యానని, దానికి జయించడానికి తనకు ఒకే ఒక పుస్తకం సహాయపడిందని ఆమె వివరించారు. అదే భగవద్గీత. భగవద్గీత తనకు ఎంతో సహాయపడిందని మను వివరించారు.
‘‘మానసిక ఒత్తిడిని జయించడానికి భగవద్గీత(Bhagavad Gita) చదివాను. ప్రతి పనిలోనూ నా వంతు కృషి చేసి.. ఫలితాన్ని ఆ భగవండిపైనే వదిలేశా. విధితో మనం పోరాడలేం. తుది ఫలితాన్ని మనం నియంత్రించలేం. మెరుగైన ప్రదర్శన మాత్రమే మన చేతిలో ఉంది. క్వాలిఫికేషన్ తర్వాత ఇంకేం జరుగుతుందో తెలియదు. చాలా కష్టపడ్డాం. చేయగలిగినంతా చేశాం. పతకం సాధించడం గొప్ప అనుభూతి. నా వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కోచ్ జస్పాల్ రాణా, స్పాన్సర్‌లకు ధన్యవాదాలు’’ అని Manu Bhaker తెలిపింది.