Womens Asia cup -2022 :షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మహిళల ఆసియా కప్ పైనల్‌లో మహిళా భారత్ జట్టు విజయ దుందుభి మోగించింది. శ్రీలంక జట్టుపై ఘన విజయం సాధించి, మన అమ్మాయిలే కప్పును సాధించారు. ప్రత్యర్థి జట్టుపై నెగ్గి మహిళల ఆసియా కప్-2022 (Womens Asia cup) విజేతగా భారత్‌ను నిలిపారు. మెుదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. కేవలం 65 పరుగులకే శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
భారత జట్టులోని బ్యాటర్లలో ఓపెనర్ అయిన స్మృతి మందాన 51 పరుగులతో నిలిచి మ్యాచ్ మెుత్తాన్ని ఒంటి చేత్తో గెలిపించేసింది. భారత్ పేసర్ రేణుకా సింగ్ సైతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రేణుక 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి, కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి శభాష్ అనిపించింది. బౌలర్ల ధాటికి శ్రీలంక కాకావికలం అయిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. శ్రీలంక బ్యాటర్లలో రణి సింఘే 13, రణవీర 18 మినహా మిగిలిన జట్టు సభ్యులంతా సింగిల్ డిజిట్ స్కోర్లు మాత్రమే చేయగలిగారు.