T20 world cup 2022 :వరల్డ్ కప్‌లో భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మెుదటి వార్మప్ మ్యాచ్‌లో ఆరు పరుగల తేడాతో భారత్ నెగ్గింది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) హాఫ్ సెంచరీలు సాధించారు. భారీ అంచనాల నేపథ్యంలో క్రీజులోకి అడుగుపెట్టిన హార్థిక్ పాండ్య (2) నిరాశపరిచాడు. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (19), దినేశ్ కార్తిక్ (20) ఫర్వాలేదనిపించుకున్నారు. టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 స్కోర్ సాధించింది. బ్రిస్బేన్ వంటి పెద్ద మైదానంలో భారీ షాట్లు కొట్టడం బ్యాటర్స్‌కు కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు భారీ షాట్లు ఈజీ క్యాచ్‌లు అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కేఎల్ రాహుల్ మాత్రం మెుదటి బంతి నుంచే దూకుడుగా ఆడాడు.
కెప్టెన్ రోహిత్‌తో కలిసి, కేఎల్ రాహుల్ 78 పరుగులు సాధించారు. కానీ స్వల్ప కాలంలో ఓపెనర్లు ఔట్ అయ్యి, పెవిలియన్‌కు చేరటంతో.. భారత్‌కు పరాజయం తప్పదేమోనని భావించారు. సూర్యకుమార్ కీలక ఇన్నింగ్స్ ఆడి.. అర్థసతకం సాధించాడు. అయితే చివరి ఓవర్‌లో ఔట్ అయ్యాడు. విరాట్, సూర్య నిలకడగా ఆడటంతో స్కోర్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా భారత్‌కు దీటుగా ఆడింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (35), ఆరోన్ ఫించ్(76) భారత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. కానీ భారత్ బౌలర్ మహ్మద్ షమీ 20వ ఓవర్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక్క ఓవర్ అవకాశం ఇచ్చినా.. యార్కర్లతో రాణించాడు. చివరి ఓవర్‌లోనే మెుత్తం మూడు వికెట్లు తీసి.. మ్యాచ్ గెలిచేందుకు శాయశక్తులా పోరాడాడు.