ఆసియా కప్ ముంగిట టీమిండియాకు బిగ్ షాక్..!

0
134

ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

అయితే జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నేపథ్యంలోనే విరామం తీసుకున్న టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు తాజాగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయింది.

దీనితో రాహుల్ ద్రావిడ్ ఆసియా కప్ కు దూరం కానున్నారు. ఆగస్ట్ 28న పాక్ తో మాచ్ కు ది వాల్ దూరం కానున్నట్లు తెలుస్తుంది. టీమిండియా తాత్కాలిక కోచ్‌ గా VVS లక్ష్మణ్ నే బీసీసీఐ కొనసాగించే ఛాన్స్‌ ఉంది.