ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా..ముగ్గురు అరెస్ట్

0
138

నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే టికెట్ల విక్రయంలో HCA పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించి బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేష్, దయాకర్, అరుణ్ అనే ముగ్గురి నుండి 6 టికెట్లు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.