Blinkit | మార్కెటింగ్ అనేది ఒక కళ. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రంగంలోకి ముందుకు దూసుకెళ్లాలనేది దీని ప్రధాన సూత్రం. దీనిని బ్లింక్‌ఇట తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ(Champions Trophy) మ్యాచ్‌లో పాక్ ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని కూడా బ్లింక్‌ఇట్.. తన ప్రచార సాధనంగా వాడేస్తోంది. అయితే భారత్ చేతిలో పాక్ ఓడిన ప్రతిసారి.. పాక్ అభిమానులు టీవీలు పగలగొట్టడం సాధారణం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్ డెలివరీ యాప్ బ్లింకిట్ సెటైర్లు వేసింది.
“సారీ పాక్.. మీకు 10 నిముషాల్లో టీవీని డెలివరీ చేయలేం” అంటూ Blinkit ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మరోవైపు ఢిల్లీ పోలీస్ శాఖ కూడా ఇలాంటిదే ఒక పోస్ట్ పెట్టింది. భారత్ చేతిలో పాక్ ఓడిపోయి, అభిమానులు టీవీలు పగలగొట్టడాన్ని ఉద్దేశిస్తూ.. పక్క దేశం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు అవి కేవలం టీవీలు బద్దలు కొట్టిన శబ్దాలు అని మాత్రమే అనుకుంటున్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెట్టింట ఈ సెటైర్ బాగా పేలింది. పాక్ లో టీవీలకు ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.