కామన్వెల్త్ గేమ్స్..భారత్ కు వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం

0
90

ఈ ఏడాది కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇప్పటి వరకు మొత్తం 9 పతకాలు దక్కగా.. వాటిలో ఏడు పతకాలు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం గర్వపడే విషయం. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ తో ఖాతా తెరిచిన భారత్ కు అదే ఈవెంట్ లో భారత్‌కు మరో పతకం దక్కింది. వెయిట్‌లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో మొత్తం 212 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం సాధించింది.