కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందు భారత బృందానికి షాకింగ్ వార్త తెలిసింది. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు భారత ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాల్సిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోవిడ్ బారినపడినట్లు ప్రచారం జరుగుతుంది. సింధుకు సంబంధించిన ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో తొలుత కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఆ తర్వాత మళ్లీ జరిపిన టెస్ట్‌లో ఫలితం మరోలా ఉందని, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఎటు తేల్చుకోలేక ముందు జాగ్రత్తగా సింధును ఐసోలేషన్‌కు తరలించారని సమాచారం.