ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై 70 పరుగుల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్‌కు చేరుకుంది. 14 మ్యాచుల్లో 8 విజయాలతో 17 పాయింట్లు సాధించిన ధోనిసేన..ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ వార్నర్ (86) ఒంటరి పోరాటం చేసినా.. జట్టును గెలిపించలేకోపోయాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. 224 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభం నుంచే చతికిల పడిపోయింది. చివరకు ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడిపోయింది.
ప్లేఆఫ్కు చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీపై ఘన విజయం
-