మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni).. ఈ పేరుకు పెద్దగా కాదు అసలు పరిచయమే అక్కర్లేదు. భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ్యాచ్‌లో ధోనీ తీసుకునే డెసిషన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ కొన్నేళ్లుగా ధోనీ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్తాడో అర్థం కాక అభిమానులు అయోమయంలో ఉంటున్నారు. ఒకవేళ క్రికెట్ గుడ్‌బై చెప్తే ఆతర్వాత ధోనీ ప్లాన్ ఏంటి అనేది కూడా పెద్ద చర్చగానే ఉంది. ఈ విషయంలో ప్రముఖ అంపైర్ అనిల్ చైదరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ధోనీ కావాలంటే ఒక మంచి అంపైర్ అవుతాడని అనిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాయి. ఇంతకీ అనిల్(Anil Chaudhary) ఏం చెప్పాడంటే..
‘‘ధోనీ(Dhoni) రివ్యూలకు ప్రతిసారీ సానుకూల నిర్ణయాలు రావు. కానీ ధోనీ అంచనాలు మాత్రం వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ధోనీ తన చేతులతో టీ సింబల్ చూపాడంటేనే స్టేడియంలో భారీ చర్చ మొదలవుతుంది. ధోనీకి ఆట విషయంలో అద్భుతమైన అవగాహన ఉంది. చాలా సందర్భాల్లో ఇతరులు అనవసరంగా అప్పీల్ చేయకుండా కూడా ధోనీ అడ్డుకున్నాడు. ధోనీ కనుక ఏడు గంటల సమయం మైదానంలో ఉండటానికి రెడీ అంటే.. ఓ మంచి అంపైర్ అవుతాడు. మరి ఈ విషయంపై ధోనీ ఏమైనా ఆలోచన చేస్తాడేమో చూడాలి’’ అని అన్నాడు.