ధోని సర్ ప్రైజ్ వచ్చేసింది..ఓరియో-వరల్డ్ కప్ గురించి కెప్టెన్ కూల్ ఏమన్నాడంటే?

0
112

కెప్టెన్ కూల్. ద ఫినిషర్. జార్ఖండ్ డైనమేట్ ఇలా అభిమానుల మదిలో మహేంద్ర సింగ్ ధోని నిలిచిపోయారు. భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించిన ధోని 2020 లో అంతర్జాతీయ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడు.

ఇక ఇటీవల త్వరలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్న. అందుకోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫేస్ బుక్ లైవ్ లోకి రాబోతున్నానంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటా అని ఫ్యాన్స్ మదిలో బోలెడు ప్రశ్నలు. ఇక వాటన్నింటికి తెర దించుతూ..ధోని ఆ సర్ ప్రైజ్ ను వెల్లడించారు.

టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలవబోతుంది. అయితే ధోని ఓరియో కుకీస్ ప్రచారంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2011 లో భారత్ లోకి ఓరియో ప్రవేశించింది. అప్పుడు ఇండియా ఛాంపియన్ అయింది. ఇప్పుడు మళ్లీ భారత్ లోకి ఓరియో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు కూడా భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని ధోని చప్పుకొచ్చాడు.

అయితే ధోని ఐపీఎల్ ను వీడుతాడని అభిమానులు అంచనా వేశారు. కానీ వాటన్నింటిని తలకిందులు చేస్తూ ఓరియో- వరల్డ్ కప్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం ఇది మార్కెటింగ్ స్టంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.