టీమిండియా యంగ్ బ్యాటర్ పృథ్వీ షా(Prithvi Shaw) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సెహ్వాగ్ తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడతున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్‌లో రాణిస్తున్నా.. టీమిండియాలో మాత్రం చోటు దక్కడం లేదు. దీంతో పృథ్వీ షాపై బీసీసీఐ వివక్ష చూపుతోందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు విమర్శలు గుప్పించారు.
తాజాగా.. భారత జట్టులో చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమిండియా నుంచి ఎందుకు తప్పించారో తనకు తెలియదని, ఎవరూ ఎలాంటి కారణం చెప్పలేదని షా చెప్పాడు. అయితే కొందరు తన ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తారని, దీంతో ఎన్సీయేకు వచ్చి అన్ని టెస్టులు పాసయ్యానని తెలిపాడు. అయినా సరే వెస్టిండీస్ టూర్‌కు తనను ఎంపిక చేయకపోవడం చాలా బాధించిందని పృథ్వీ షా అన్నాడు. ప్రస్తుతం విండీస్ టూర్‌కు సెలెక్టర్లు పృథ్వీ షా(Prithvi Shaw)ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
Read Also: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… BRO ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడే!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat