ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root).. టెస్ట్ క్రికెట్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస రికార్డ్‌ల సృష్టిస్తున్నాడు. తాజాగా మరో అరుదైన రికార్డుపై తన సంతకం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 11 పరుగులు వ్యక్తిగత స్కోరు చేయడంతోనే అతడు ఈ రికార్డును తన పేరిట చేసేసుకున్నాడు. తన 11 పరుగుతోనే శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును జో రూట్ అధిగమించేశాడు. అంతేకాకుండా ఈ స్టార్ ఆటగాడు మరో అరుదైన రికార్డుకు అతి చేరవలోనే ఉన్నాడు. దీంతో మరికొద్ది రోజుల్లోనే జో రూట్ మరో రికార్డు చేయడం పక్కా అని అంతా అంటున్నారు.
ప్రస్తుతం జో రూట్(Joe Root) తన టెస్ట్ కెరీర్‌లో 12,402 పరుగులు చేశాడు. తన 146వ టెస్ట్‌లో సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. కాగా రూట్ మరో 83 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మరో అడుగు ముందుకేయనున్నాడు. ఈ 83 పరుగుల లక్ష్యాన్ని రూట్ చేస్తే.. ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను అధిగమిస్తాడు. టెస్టుల్లో కుక్.. 12,472 పరుగులు చేశాడు. జో రూట్ ప్రస్తుతం ఫామ్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తో వచ్చే నెలలో పాక్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కుక్ రికార్డ్‌కు బ్రేక్ చేయడం ఖాయం. దీంతో పాటుగా ఈ ఏడాదిలోనే జో రూట్.. అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ జాబితాలో 15,921 పరుగులతో సచిన్, 13,378 పరుగులతో రికీ పాంటింగ్, 13,289 పరుగులతో జాక్వెన్, 13, 288 పరుగులతో రాహుల్ ద్రవిడ్, 12, 472 పరుగులతో కుక్ వరుస స్థానాల్లో ఉన్నారు.