మొదటి వన్డేలో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది టీమిండియా. కానీ రెండో వన్డేలో సీన్ రివర్స్ అయిపోయింది. రెండో వన్డేలో భారత్ బ్యాట్స్ మెన్ పూర్తిగా తేలిపోయారు. ఇక మూడో వన్డేలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. చెరో మ్యాచ్ గెలిచిన ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ఇరుజట్లు తహతహలాడుతున్నాయి. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా నేడు చివరి మ్యాచ్ జరగనుంది.
రోహిత్, ధావన్, పంత్ విలువైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. బౌలింగ్ దళం రాణించాల్సి ఉంది. ఇంగ్లాండ్ లో రాయ్, బట్లర్, బెయిర్ స్టో రాణిస్తే గెలుపు నల్లేరు మీద నడకే.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, బుమ్రా, షమీ, ప్రసిధ్ కృష్ణ