టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో టీమిండియా(Team India) కస్టాల నుంచి కోలుకులేకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచిత్తు చేసి పాయింట్ల పట్టికలో ఖాతా ఓపెన్ చేసింది. కానీ సెమీఫైనల్ బెర్త్ మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. పాక్‌పై గెలిచినా సెమీస్‌కు మార్గం సుగమం కాకపోవడమే ఇందుకు నిదర్శనం. టీమిండియా ఆడనున్న రెండు మ్యాచ్‌లు కూడా ఆసియా ఛాంపియన్ శ్రీలంక, డిఫెండర్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేరలియాతో ఉన్నాయి. దీంతో టీమిండియాకు సెమీఫైనల్ ప్రయాణం నల్లేరుపై నడకలా మారనున్నట్లు అర్థమవుతోంది.
టీమిండియా(Team India) తమ సెమీస్‌కు చేరాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా సెమీస్‌కు వెళ్లాలన్న టీమిండియా కల దాదాపుగా చెదిరినట్లేనని విశ్లేషకులు సైతం చెప్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2024 టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మహిళలు ఘోరపరాజయాన్ని మూటగట్టుకుని ఈ కష్టాల్లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్ భారీ రన్ రేట్‌తో గెలవడంతో పాయింట్ల పట్టికలో భారత్ మహిళల జట్టు -2.900గా నిలిచింది. ఇప్పుడు పాకిస్థాన్‌పై భారీ తేడాతో గెలిచి ఉంటే సెమీస్‌కు దారి సుగమం అయి ఉండేది కానీ.. అలా కాకపోవడంతో టీమిండియా నెట్ రన్ రేట్ పెద్దగా మెరుగుపడలేదు.
ఈ క్రమంలో శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు మ్యాచ్‌లు టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 జర్నీలో అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ రెండిటిలో గెలిస్తే సెమీస్‌కు చేరడం భారత్‌కు కాస్తంత తేలికవుతుంది. ఏమాత్రం అటుఇటూ అయి ఒక్క మ్యాచ్ ఓడినా.. టీమిండియా సెమీస్ ప్రయాణం మరింత కష్టం కానుంది. ఈ క్రమంలో టీమిండియాపై ఒత్తిడి పెరగనుంది. మరి ఈ డూ ఆర్ డై పరిస్థితుల్లో భారత్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.