భారత్‌-పాక్ మ్యాచ్‌ కు రంగం సిద్ధం.. ఢీ అంటే ఢీ అంటున్న ఇరు జట్లు

-

ఆసియా కప్‌ లో మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 4 దశలో భారత్-పాక్ జట్లు మరోసారి తలపడనున్నాయి. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 3గంటలకు కొలంబో వేదికగా మ్యాచ్‌ ప్రారంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. దీంతో మ్యాచ్‌ నువ్వా నేనా అన్నట్లు సాగనుంది. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో పాక్‌ మ్యాచ్‌లో ఆడనున్నాడు. బుమ్రా రాకతో శార్దుల్ ఠాకూర్‌ ను తప్పించే అవకాశం ఉంది. ఇటు కేఎల్ రాహుల్ బెంచ్‌ కే పరిమితమయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్‌ లో అడుతున్న ఇషాన్ కిషన్‌ రప్ఫాడిస్తున్నాడు. దీంతో కేఎల్ రాహుల్‌ కు మొండి చేయి ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రూప్‌ లో దశలో ఆడిన జట్టే.. పాక్‌ మ్యాచ్‌ లో ఆడనుంది.

- Advertisement -

ఈనెల 2న జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారీ వర్షం పడటంతో మ్యాచ్‌ ను రద్దు చేశారు. భారత్, పాక్‌ కు చెరో పాయింట్ ఇచ్చారు. ఈసారి కూడా వర్ష గండం ఉండటంతో ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దాయాది దేశాల మ్యాచ్‌ కోసం రిజర్వ్ డే ను కేటాయించింది. ఆదివారం వాన కారణంగా మ్యాచ్‌ ఆగిపోతే.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి సోమవారం ఆట మొదలు కానుంది. ఆసియా కప్‌ లో ఇప్పటి వరకు ఫైనల్‌ మ్యాచ్‌ కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. అయితే తొలిసారి ఏసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ మ్యాచ్‌ లో గెలిచి సూపర్‌ 4 లో శుభారంభం చేయడానికి రోహిత్ సేన రెడీ అయింది. అటు పాకిస్తాన్ సూపర్ 4 మొదటి మ్యాచులో బంగ్లాదేశ్ జట్టు పై గెలిచి మంచి ఊపు మీదుంది. మొత్తం మీద దాయాదుల పోరు అభిమానులకు మరోసారి ఫుల్ జోష్‌ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...