IND Vs SA- చివరి మ్యాచ్ పై ఉత్కంఠ..గెలిచినోళ్లదే సిరీస్

0
147
IND vs SA

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమ్​ఇండియా మిగతా రెండు మ్యాచుల్లో గెలిసి అదిరే ప్రదర్శన కనబరిచింది. అయితే ఇప్పుడు ఐదో 20 పోరుకు రంగం సిద్ధమైంది. గత రెండు మ్యాచ్ ల్లో ఉన్న అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఇండియా చూస్తోంది. సౌతాఫ్రికా గెలిస్తే టీ20 సిరీస్‌ తన ఖాతాలో వేసుకుంటుంది.

కోహ్లి, రోహిత్‌, రాహుల్‌, బుమ్రా, షమి లాంటి సీనియర్లు లేకుండా టీమిండియాను ఊహించడం కష్టం. కానీ యువఆటగాళ్లతో కూడిన జట్టు అద్భుతాలు చేస్తారని అంత భావించారు. కానీ వరుసగా తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడంతో జట్టుపై ఎన్నో విమర్శలు, కుర్రాళ్ల సత్తాపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు ఆటతో సత్తా చాటారు.

రుతురాజ్, కిషన్, శ్రేయాస్, పంత్, హార్దిక్ లో ఎవరు నిలబడ్డ భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్ లో చాహల్, భువి, ఆవేష్ ఖాన్ కీలక కానున్నారు. గత మ్యాచ్‌లో గాయపడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ బ్యాటింగ్‌కు రాని కెప్టెన్‌ బవుమా.. ఆదివారం బరిలోకి దిగడంపై స్పష్టత లేదు. గత మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయిన రబాడ.. చివరి టీ20లో ఆడనున్నాడు.

తుది జట్లు (అంచనా)… భారత్‌: రుతురాజ్‌, ఇషాన్‌, శ్రేయస్‌, పంత్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, అవేష్‌, చాహల్‌.
దక్షిణాఫ్రికా: డికాక్‌ (వికెట్‌ కీపర్‌), బవుమా (కెప్టెన్‌)/రీజా హెండ్రిక్స్‌, ప్రిటోరియస్‌, వాండర్‌డసెన్‌, క్లాసెన్‌, మిల్లర్‌, జాన్సన్‌/షంసి, నోకియా, రబాడ, కేశవ్‌ మహరాజ్‌, ఎంగిడి.