Expectations on World T20 cup 2022: T20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.. నేడు మధ్యాహ్నం 1.30 జరిగే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎవరు గెలుస్తారా.. అని ఉత్కంఠతో ఉన్నారు. కాగా టీ20 ముఖాముఖి పోరులో ఇప్పటి వరకు రెండు జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అందులో ఇంగ్లండ్ 18 సార్లు విజేతగా నిలిస్తే.. పాకిస్తాన్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే తుది ఘట్టనికి చేరిన పాకిస్థాన్ గురించి క్రికెట్ అభిమానుల్లో మాత్రం ఓ అనుమానం ఉంది.
1992ను పాకిస్థాన్ పునరావృతం చేస్తుందా.. లేకా పవర్ హిట్టర్స్‌తో ఉన్న ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తుందా అనే డైలమాలో పడ్డారు. ఇది ఇలా ఉంటే మ్యాచ్ జరిగే మెల్బోర్న్ సిటీలో ఫైనల్ మ్యచ్‌లో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఫైనల్‌కు రిజర్వ్‌డే ఉంది. కానీ రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వాన పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ పేర్కొంది. అదే జరిగితే.. సోమవారం ఇన్నింగ్స్‌కు 10 ఓవర్ల చొప్పున ఆట కూడా సాధ్యం కాకపోతే రెండు జట్లను ప్రపంచకప్ విజేతలుగా ప్రకటిస్తారు.