బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల విషయంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అడిలైడ్ టెస్ట్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా కొందరు ఫ్యాన్స్ అనచితంగా ప్రవర్తించారు. దీంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆడిలైడ్ మ్యాచ్ ముందు టీమిండియా ప్రాక్టీస్‌ను చూడటం కోసం భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలి వచ్చారు. వారిలో కొందరు భారత ప్లేయర్లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో ప్లేయర్లు ఇబ్బంది పడినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్వాహకులు ఈ కఠన నిర్ణయం తీసుకున్నారు.
Border Gavaskar Trophy | ‘‘టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్టేడియం అంతా గోల గోలగా ఉంది. దాదాపు మూడు వేల మందికిపైగా ఈ ప్రాక్టీస్ చూడటానికి వచ్చారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చాలా ప్రశాంతంగా సాగింది. భారత్ ప్రాక్టీస్ అప్పుడు కొందరు ఫేస్‌బుక్ లైవ్ పెడితే మరికొందరు వీడియా కాల్స్ చేసి గట్టిగట్టిగా మాట్లాడారు.
మరికొందరు హాయ్ చెప్పాలంటూ భారత ప్లేయర్లను పదేపదే అడిగారు. ఒక వ్యక్తి అయితే ఒక క్రికెటర్ శరీరం గురించి అవహేళనగా మాట్లాడాడు. అందుకే ఇకపై ఈ సరీస్‌లో భారత్ ప్రాక్టీస్ అప్పుడు అభిమానులను అనుమతించడం లేదు’’ అని బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి.