Cricketer Badrinath | జింబాబ్వే టూర్‌లో, అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్‌లో తనదైన ప్రదర్శనతో అందరి చేత శభాష్ అనిపించుకున్న ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad). శుభ్‌మన్ గిల్(Shubman Gill)తో పోల్చుకుంటే రుతురాజ్ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అటువంటిది టీ20, వన్డేల్లో శుభ్‌మన్‌కి వైస్ కెప్టెన్సీ అందించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. రుతురాజ్‌ను మాత్రం పక్కనబెట్టింది. ఇప్పటికే పలుసార్లు రుతురాజ్‌ను అవమానించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. ఇప్పుడు శ్రీలంక టూర్ టీమ్‌కు రుతురాజ్ సెలక్ట్ కూడా చేయలేదు. దీంతో ఈ అంశంపై మాజీ క్రికెటర్ బద్రీనాథ్ ఘాటుగా స్పందించాడు. టాలెంట్ ఉన్న వాళ్లను ఎప్పుడూ తొక్కేయడమే పనిగా టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు.
‘‘టీమిండియాలో చోటు దక్కాలంటే బ్యాడ్ గాయ్ ఇమేజ్ కావాలనుకుంటా. అద్భుతమైన టాలెంట్, ఒత్తిడిలో కూడా కళ్లుచెదిరే పర్ఫార్మెన్స్ ఇవ్వడం కాదు. బాలీవుడ్ భామలతో ఎఫైర్లు నడిపిస్తూ మంచి మీడియా మేనేజర్‌ను పెట్టుకుని, వంటిపైన ఎక్కడపడితే అక్కడ టాటూలు వేసుకోవాలేమో. ఇలాంటివి ఏవీ చేయకపోవడం వల్లే రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ వంటి మంచి ప్లేయర్లకు జట్టులో స్థానం దక్కట్లేదు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బద్రీనాథ్. అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయి చర్చలకు దారితీస్తున్నాయి. మరి బద్రీనాథ్(Cricketer Badrinath) కామెంట్స్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.