Jacques Kallis |47ఏళ్ల వయసులో తండ్రైన సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్

-

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కలిస్(Jacques Kallis) 47ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య చార్లీన్ బుధవారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిందని కలీస్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘అందమైన మా కూతురిని మీకు పరిచయం చేస్తున్నా.. చోలే గ్రేస్ కలిస్..బుధవారం ఉదయం 8.37 గంటలకు జన్మించింది. మా చిన్నారి 2.88 కిలోల బరువుతో పుట్టింది. ఇప్పటికే తాను డాడీ చేతిని పట్టేసుకుంది. తల్లీ కూతురు ఇద్దరూ బాగున్నారు. మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి’ అని కలిస్ ట్వీట్ చేశాడు. కాగా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరుగడించిన కలిస్(Jacques Kallis) దక్షిణాఫ్రికా తరఫున 166 టెస్టులు ఆడి 13,289 పరుగులు చేశాడు. వన్డేల్లో 11,579 రన్స్ చేసి దక్షిఫ్రికా క్రికెట్ చరిత్రలో దిగ్గజంగా నిలిచాడు.

- Advertisement -

Read Also: తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌కు పాక్ నాయకుడు.. ఆసక్తికరంగా మారిన పర్యటన

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...