టీమిండియా టీ20 కెప్టెన్ విషయంలో ఫిట్‌నెస్ సరిగా ఉండని కెప్టెన్‌తో తాను పనిచేయలేనంటూ పరోక్షంగా పాండ్యాకు కెప్టెన్సీ వద్దని గంభీర్(Gambhir) చెప్పాడు. గంభీర్ మాటలను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను ఎంపిక చేశారు. దీంతో పాండ్యాకు దిమ్మతిరిగిపోయింది. ఈ షాక్‌ను బయపడకముందే పాండ్యాకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరో షాక్ ఇచ్చాడు. అదేంటంటే త్వరలో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ ఎంపిక. ఛాంపియన్ ట్రోఫీకి వెళ్లే టీమ్‌లో పాండ్యా పేరు ఉండాలంటే తన బౌలింగ్‌తో తానేంటో నిరూపించుకోవాలని గంభీర్ తేల్చి చెప్పాడట. అది కూడా టీమిండియా ఆడే మ్యాచుల్లో సత్తా చాటడం కాదంట. డిసెంబర్‌లో జరిగే విజయ్ హజారే టోర్నీలో పాండ్యా తన సత్తా చాటితేనే ఛాంపియన్ ట్రోఫీకి వెళ్తాడని షరతు పెట్టాడట గంభీర్. ఈ మేరకు వార్తలు క్రికెట్ సర్కిల్స్‌తో తెగ వినిపిస్తున్నాయి. అందుకే పాండ్యా తన కాన్సంట్రేషన్ అంతా ట్రైనింగ్‌పైనే పెట్టాడని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అంటే భారత్ వన్డే జట్టులో స్థానం దక్కించుకోవాలంటే విజయ్ హజారే టోర్నీలో పాండ్యా(Hardik Pandya) తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేసుకోవాల్సి ఉంది. అప్పుడు ఛాంపియన్ ట్రోఫీలోకి పాండ్యా ఎంట్రీ ఇవ్వగలడు.
ఇదిలా ఉంటే గత వన్డే ప్రపంచకప్‌లో తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేసుకోవడంలో పాండ్యా విఫలమయ్యాడు. అందుకే ఇప్పుడు గంభీర్(Gambhir) ఈ షరతు పెట్టాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. వీటిలో ఒక ట్రోర్నీలో గాయం కారణమైతే, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో వ్యక్తిగత కారణాలతో అతడు వెనక్కు వెళ్లాడు. అప్పటి నుంచి పాండ్యా బౌలింగ్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అందుకే షరతు పేరుతో దేశవాళీ టోర్నీ ద్వారా భారత వన్డే జట్టులోకి పాండ్యా రీఎంట్రీ ఇవ్వాలని గంభీర్ వివరించాడని సమాచారం. మరి తన ముందు ఉన్న ఛాలెంజ్‌ను పాండ్యా అధిగమిస్తాడో లేదో చూడాలి.