టీమిండియా హెడ్ కోచ్ గంభీర్(Gautam Gambhir) శిక్షణతో తొలి సిరీస్ ఆడటానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ సమయంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) నుంచి గంభీర్‌కు ఓ వాయిస్ మెసేజ్ వచ్చింది. అది విన్న వెంటనే గంభీర్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మెసేజ్‌లో ద్రవిడ్ ఏమన్నాడంటే..
‘‘హలో గౌతమ్(Gautam Gambhir).. టీమిండియా కోచ్‌గా ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతమైన ఉద్యోగంలోకి నిన్ను స్వాగతిస్తున్నా. టీమిండియాతో నా సమయం ముగిసి మూడు వారాలవుతుంది. బార్బడోస్‌లో నేను కన్న కలలను మించి ఎంతో గొప్పగా పదవీకాలాన్ని ముగించా. ఆ తర్వాత ముంబైలో గడిపి సాయంత్రాన్ని ఎన్నటికీ మరువలేను.అన్నింటికంటే ఎక్కువగా జట్టుతో నా స్నేహాలను, జ్ఞాపకాలను ఎప్పటికీ పదిలంగా ఉంచుకుంటా. ఇప్పుడు కొత్త కోచ్‌గా నువ్వు బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా ఇలాంటి అద్భుత సమయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా’’ అని ద్రవిడ్ ఆకాంక్షించాడు.