విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ సంచలన కామెంట్స్

0
79

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు ముక్కుసూటి మాటలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక తాజాగా గంభీర్ విరాట్ కోహ్లీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. క్రికెట్ లో హీరో ఆరాధన ఉందని, అది అంత మంచిది కాదన్నారు. చాలా రోజుల తరువాత ఆఫ్ఘన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేశాడు. అదే మ్యాచ్ లో బౌలర్ భువనేశ్వర్ 5 వికెట్లతో సత్తా చాటాడు. కానీ కోహ్లీ ఆటనే అందరూ మెచ్చుకున్నారని అన్నారు. భువనేశ్వర్ ప్రదర్శనను ఎవరూ అంతగా మెచ్చుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.