సంజూ శాంసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..బీసీసీఐ కీలక నిర్ణయం..కెప్టెన్ గా ఎంపిక

0
131

సంజూ శాంసన్ అభిమానులకు గుడ్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ కు శాంసన్ కు మొండి చేయి ఎదురైంది. కాగా ఈ మేరకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు శాంసన్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. దీనితో అతని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

కాగా టీమిండియా న్యూజిలాండ్ ఏ జట్టుతో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. దీనితో 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టీంలో తెలుగు క్రికెటర్ భరత్, హైదరాబాదీ  తిలక్ వర్మ, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యారు.

టీమిండియా జట్టు ఇదే..
సంజూ శాంసన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పాటిదార్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చహర్‌, తిలక్‌ వర్మ, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నవదీప్‌ సైనీ, రాజ్‌ అంగద్‌ బవా.