భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్ రత్న అవార్డులను(Khel Ratna Award) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల చెస్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ సహా నలుగురు క్రీడాకారులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. మను భాకర్, గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ లకు పురస్కారాలు అందించనుంది. జనవరి 17, 2025 (శుక్రవారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి నుండి వీరు తమ అవార్డులను అందుకుంటారు అని క్రీడా మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్(Gukesh), షూటింగ్ లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్(Manu Bhaker), హాకీ క్రీడాకారుడు హార్మన్ ప్రీత్ సింగ్(Harmanpreet Singh), పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్(Praveen Kumar) లు దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారాలు( Khel Ratna Award) అందుకోనుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టులో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో కాంస్య పతకం సాధించిన 22 ఏళ్ల భాకర్, స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచింది.
అదే క్రీడల్లో, హర్మన్ ప్రీత్ భారత హాకీ జట్టును వరుసగా రెండవ కాంస్య పతకానికి నడిపించారు.
మరోవైపు, 18 ఏళ్ల గుకేష్ గత సంవత్సరం చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు చారిత్రాత్మక స్వర్ణం గెలవడానికి సహాయపడటంతో పాటు, అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.
నాల్గవ గ్రహీత పారిస్ పారాలింపిక్స్‌లో T64 ఛాంపియన్‌గా నిలిచిన పారా హై-జంపర్ ప్రవీణ్. T64 వర్గీకరణ అనేది మోకాలి కింద ఒకటి లేదా రెండు కాళ్ళు లేని, పరుగు కోసం ప్రొస్థెటిక్ కాలుపై ఆధారపడే అథ్లెట్లకి నిర్వహించే పోటీ.