టీమ్ఇండియా కెప్టెన్​గా హార్దిక్ పాండ్య..వైస్‌ కెప్టెన్‌ ఎవరో తెలుసా?

0
146

ప్రస్తుతం యంగ్ ప్లేయర్స్ తో కూడిన ఇండియా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ఇండియా మూడో మ్యాచ్ లో గెలిచి కొండంత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. ఈ పర్యటన అనంతరం భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. తాజాగా రెండు టీ20ల కోసం ఐర్లాండ్‌లో పర్యటించే భారత టీ20 జట్టును ప్రకటించింది సెలక్షన్​ కమిటీ.

దక్షిణాఫ్రికా సిరీస్ కి కెప్టెన్ గా ఉన్న పంత్ కు ఈ పర్యటన నుండి విశ్రాంతి ఇచ్చారు. కొత్త కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య నియమితుడయ్యాడు. భువనేశ్వర్‌ వైస్‌కెప్టెన్‌. అయితే కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి సహా ఇంగ్లాండ్‌తో టెస్టులో ఆడే ఆటగాళ్లెవరూ టీ20 జట్టులో లేరు. ఐపీఎల్‌లో విశేషంగా రాణించిన బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్‌ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌తో భారత్‌ టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

జట్టు: హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌, ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, హర్షల్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.