హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలపై నెటిజన్ల కౌంటర్లు

-

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ టీమిండియా ఓడిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య, కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అనవసరమైన ప్రయోగాలు చేసి జట్టు పరువు తీశారంటూ మండిపడుతున్నారు. మొదటి రెండు టీ20ల్లో కీలకమైన ఆటగాళ్లను పక్కనబెట్టడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సిరీస్ మొదట్లోనే తొలి రెండు మ్యాచులు ఓడిపోవడంతో వెనకబడిపోయింది. తర్వాత తీరిగ్గా తేరుకుని మార్పులు చేయడంతో తర్వాత రెండు మ్యాచులు గెలిచింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

- Advertisement -

ఇక చివరిదైన ఐదో టీ20 మ్యాచులో మొదట బ్యాటింగ్ తీసుకుని పెద్ద తప్పిదం చేసింది. దీంతో 2-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. సిరీస్ ఓటమిపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్పందించిన తీరుపై మరింత ఘాటుగా విమర్శలు వస్తున్నాయి. . ఒక్క సిరీస్ ఓడిపోయినంత మాత్రాన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఓటమిపై మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఓడిపోయిన మ్యాచ్‌ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉందని అన్నాడు.

ప్రపంచ కప్‌ కు సమయం దగ్గర పడుతోందని… కొన్ని సందర్భాల్లో ఓడిపోవడం కూడా మంచే చేస్తుందన్నాడు. ఆట అన్న తర్వాత గెలుపు, ఓటమిలు సహజమని చెప్పాడు. ‘కెప్టెన్‌గా విఫలం కావడంతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయావు. మూడో టీ20లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా నీ స్వార్థం కోసం సిక్స్ కొట్టావు” అంటూ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 18 నుంచి ఐర్లాంట్ జట్టులో మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా ఆ దేశానికి బయలుదేరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...