గత 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు-ప్రణాళికతో జరిగిందా?..ద్రావిడ్ క్లారిటీ

0
155

గత 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు. ఇది ఇండియా క్రికెట్ జట్టు పరిస్థితి. అయితే భవిష్యత్తులో కెప్టెన్ ను నిర్ణయించడానికి ఇలా ప్రణాళిక రచించారని తెలుస్తుంది. తాజాగా ఈ వార్తపై  ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. అయితే ఇది ప్రణాళికతో జరిగింది కాదని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. జట్టులో మరింత మంది నాయకులను తయారు చేసేందుకు తమకు అవకాశాలు దక్కాయని చెప్పాడు.

వివిధ సిరీస్‌లకు ధావన్‌, కోహ్లీ, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, హార్దిక్‌ పాండ్య (ఐర్లాండ్‌ పర్యటనకు కెప్టెన్‌) భారత జట్లకు నాయకులుగా ఉన్నారు. బయో బబుల్‌ విరామాలు, ఒకే సమయంలో రెండు సిరీస్‌లు జరగడం, గాయాలు.. ఎక్కువ మంది భారత జట్లకు సారథ్యం వహించడానికి కారణాలు.

“గత ఎనిమిది నెలల్లో మా జట్టులో ఆరుగురు కెప్టెన్లయ్యారు. ఇంతమందికి పగ్గాలు అప్పగించడమన్నది అనుకుని చేసింది కాదు. భారత్‌ చాలా మ్యాచ్‌లు ఆడుతుండడం ఇలా జరగడానికి కారణం. మరింత మంది నాయకులను తయారు చేసేందుకు మాకు అవకాశాలు లభించాయి” అని ద్రవిడ్‌ చెప్పాడు.