ఆసియా కప్ లో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. పాక్ , శ్రీలంకతో మ్యాచ్ లో ఆటగాళ్లు తేలిపోయారు. దీనిపై ప్రతి ఒక్కరు భారత జట్టుపై విమర్శలు చేస్తున్నారు. ఒకరు కారణం బౌలర్లు అని చెప్పగా మరొకరు బ్యాటింగ్ బాలేదని, ఫీల్డింగ్ జట్టును ముంచిందని చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా భారత్ జట్టు ఓటమిపై రోహిత్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “మొదటి ఆరు ఓవర్లలో మేము ఆశించినంత స్కోరు చేయలేకపోయాం. దానికి కారణం ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడమే. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో స్కోరు వచ్చినా..చివర్లో మళ్లీ ఆ లయ దెబ్బతింది.
దీంతో ఆశించిన దానికంటే ఓ 10-12 పరుగులు తక్కువ చేశాం. కానీ శ్రీలంకకు మంచి శుభారంభం దక్కింది. దాంతో మేము ఒత్తిడిలో పడిపోయాం. కానీ స్పిన్నర్లు మళ్లీ మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చారు. అయితే మ్యాచ్‌ను సరిగా ముగించలేకపోయాం” అని రోహిత్ శర్మ వెల్లడించాడు.