ప్యారిస్ ఒలింపిక్స్‌లో(Paris Olympics) అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat). ఆమె ఫైనల్‌కు ముందు రోజు రాత్రి మూడు కిలోల బరువు పెరిగింది. ఎంత శ్రమించినా పరిమితికి తగ్గ బరువును ఆమె సాధించలేకపోయింది. చివరికి పరిమితికి మించి వంద గ్రాములు అధిక బరువు ఉండటంతో అధికారులు ఆమెపై అనర్హత వేటు వేశారు. అనర్హత తర్వాత ఆమె రాజీనామా కూడా ప్రకటించింది. కానీ తన అనర్హతపై పోరాటం మాత్రం ఆపలేదు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో కూడా వినేష్‌కు నిరాశే ఎదురైంది.
సెమీ ఫైనల్ తర్వాత 49.9 కేజీల బరువు ఉన్న వినేష్(Vinesh Phogat).. ఫనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కేజీలకు బరువు పెరిగింది. ఎంత కష్టపడిన పరిమితి కన్నా వంద గ్రాముల అధిక బరువు ఉంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన వైద్య నిపుణులు వినేష్ బరువు పెరగడానికి మూడే కారణాలని చెప్పారు. ఆమె ఫైనల్‌కు ముందు రోజు ఒక గ్లాస్ జ్యూస్, కొన్ని ఫ్లూయిడ్స్, కొన్ని స్నాక్స్ మాత్రమే తిన్నట్లు సమాచారమని, వాటి వల్లే వినేష్ బరువు ఒక్కసారిగా పెరిగారని అభిప్రాయపడుతున్నారు. కానీ అదెలా సాధ్యమైందో అర్థం కావట్లేదని, ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.