టీమిండియా కోచ్‌గా మారడంపై మాజీ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) క్లారిటీ ఇచ్చారు. తాను ఎట్టిపరిస్థితుల్లో టీమిండియా హెడ్ కోచ్(Team India Head Coach)గా గానీ మెంటార్‌గా కానీ బాధ్యతలు చేపట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఒకవేళ ఐపీఎల్‌లో ఈ అవకాశం వస్తే పరిశీలిస్తానని తెలిపారు. అందుకు తనకు బలమైన కారణాలు ఉన్నాయన్నారు. టీమిండియా కోచ్ లేదా మెంటార్‌గా బాధ్యతలు చేపడితో ఏడాదిలో 8,9 నెలల పాటు టీమ్ ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లాలని, అందుకే టీమిండియా కోచ్ పదవిపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.
‘‘నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి వయసు 14,16. వారు ఇప్పుడు ఢిల్లీ తరపున క్రికెట్ ఆడుతున్నారు. ఒకరు ఓపెనింగ్ బ్యాటర్ అయితే మరొకరు ఆఫ్ స్పిన్నర్. వారికి క్రికెట్ పరంగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు టీమిండియా కోచ్‌గా వెళ్తే వారికి ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వలేను. అందుకే టీమిండియా కోచ్ పదవికి దూరంగా ఉంటున్నా. ఇలాంటి అవకాశం ఐపీఎల్‌లో వస్తే తప్పకుండా పరిశీలిస్తా’’ అని చెప్పారు సెహ్వాగ్(Virender Sehwag).