Ravi Shastri | టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫామ్ కోల్పోయి రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వైస్ కెప్టెన్సీ హోదా నుంచి కూడా బీసీసీఐ రాహుల్‌ను తప్పించింది. దీంతో రాహుల్ ఆటతీరుపై రవిశాస్త్రి మొదటిసారి స్పందించారు. కేఎల్ రాహుల్ గురించి అందరికీ తెలుసన్నారు. శుభమన్ గిల్ లాంటి వారిని ఎలా చూడాలో కూడా తెలుసన్నాడు. భారత జట్టుకు వైస్ కెప్టెన్ అవసరం లేదనే తాను నమ్ముతానన్నాడు.
Ravi Shastri | 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాలని కోరుకుంటానన్నాడు. ఒకవేళ కెప్టెన్ కనుక మైదానాన్ని విడిచిపెట్టాల్సి వస్తే అప్పుడు హైరానా పడిపోవాల్సిన అవసరం కూడా లేదన్నాడు. జట్టులోని మరో ఆటగాడికి ఆ బాధ్యత అప్పగిస్తే సరిపోతుందని చెప్పుకొచ్చాడు. అతడు సరైన ప్రదర్శన చేయకపోతే అప్పుడు ఇంకెవరినైనా తీసుకోవచ్చనన్నారు. ప్రస్తుతం రాహుల్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు భారీ ప్రదర్శన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అతడు గొప్ప ఆటగాడేనని, కాకపోతే ఇక్కడ ప్రదర్శనే ముఖ్యమన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నాడు.