భారత స్టార్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(Chahal) కూడా ఒకడు. టీ20 ప్రపంచకప్‌లో బెంచ్‌కే పరిమితమైన చాహల్.. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ టీమిండియా జెర్సీ వేసుకోలేదు. టీమిండియా తరపున మైదానంలోకి దిగలేదు. జింబాబ్వే, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లకు కూడా ఎంపిక కాలేదు. దీంతో విదేశీ టోర్నీలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌ఫైర్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ కౌంటీలో చాహల్ చిచ్చరపిడుగులా రాణిస్తున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో ఐదైదు వికెట్లు తీసి ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారాడు. ఇంతకాలంగా టెస్ట్ ఫార్మాట్‌లో అవకాశం దొరక్క దూరంగా ఉన్న చాహల్‌కు ఎట్టకేలకు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో చాహల్ తొలిసారి టీమిండియా కోసం రెడ్ బాల్ పట్టనున్నాడు.
ఇన్నాళ్లూ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో అదరగొడుతుండటంం వల్లే చాహల్‌కు అవకాశం రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా అద్భుతంగా వినియోగించుకుంటానని చాహల్ అంటున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టేస్తానంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘కౌంటీ క్రికెట్‌లో ఆడటంం చాలా కష్టం. ఇక్కడ రాణించగలిగితే టీమిండియాలో రాణించడం పెద్ద కష్టంగా అనిపించదు. నా ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి ఇదొక మంచి అవకాశం. వచ్చే ఏడాది జరిగే భారత్-ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాలన్నదే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం’’ అని చాహల్(Chahal) చెప్పాడు.