ఫ్లాష్..ఫ్లాష్..కామెంటరీ కెరీర్కు ఇయాన్ చాపెల్ గుడ్ బై

0
85

ఆస్ట్రేలియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్, ప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్ ఇయాన్ చాపెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 45 ఏళ్లుగా ఎన్నో మ్యాచులకు కామెంటరీ సేవలందించిన ఆయన కామెంటరీ కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అతన్ని ఇటీవల ఓ ప్రముఖ వార్తా సంస్థ ఇంటర్వ్యూ చేయగా..ఇంటర్వ్యూలో అతను కామెంటరీకు గుడ్‌బై చెప్పాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.

కామెంటేటర్‌గా తన కెరీర్‌ మొదలెట్టిన చాపెల్ సుమారు 45ఏళ్ల పాటు కామెంటరీ ప్యానెల్లో ఎన్నో మంచి విశ్లేషణలతో కూడిన కామెంట్రీ అందించాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కామెంటేటర్‌గా మంచి ఘనత సాధించాడు. ఈ నిర్ణయానికి గల కారణం..కొన్నేళ్ల కిందట హార్ట్ ఎటాక్ వచ్చినప్పటి నుంచి తన ఆరోగ్య పరిస్థితి బాగుండడం లేదని చెప్పుకొచ్చాడు.