ICC వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్..స్పెషల్ ఎట్రాక్షన్ గా ధోని వారసుడు-Video

0
124

మహేంద్రసింగ్ ధోని తరువాత అతని వారసునిగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్. దానికి తగ్గట్టే ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలెన్నో. టెస్ట్ మ్యాచ్ లోను టీ20 ని తలపించే ఆటతీరు అతని సొంతం. దీనితో అందరి కళ్లు వచ్చే టీ20 ప్రపంచకప్ పై పడ్డాయి.

ఈ నేపథ్యంలో ICC వరల్డ్ కప్ కు సంబంధించి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో పంత్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. సముద్రంలో అలల నుండి పంత్ బ్యాటింగ్ కు రావడం ఆకట్టుకుంటుంది. అటు ఇంగ్లాండ్ తో చివరి టెస్ట్ మ్యాచ్ లో పంత్ ఫామ్ లోకి వచ్చి చెలరేగాడు. దీనితో వచ్చే ప్రపంచకప్ లో పంత్ కీలకం కానున్నాడు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

https://www.facebook.com/100025004763650/videos/2193134420863931

మరోవైపు పంత్ ఆటపై రికీ పాటింగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో చూడాల్సిన ఆటగాళ్లతో కచ్చితంగా అతనొకడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగించే ఆటగాడిగా అతణ్ని ఉపయోగించుకోవాలి. నేనైతే భారత బ్యాటింగ్‌ ఆర్డర్లో అతణ్ని అయిదో స్థానంలో ఆడిస్తా. కానీ ఏడెనిమిది ఓవర్ల ఆట మిగిలి ఉండి.. ఒకటి లేదా రెండు వికెట్లు పడ్డ సందర్భంలో అతణ్ని ముందు పంపించాలి. తనకు వీలైనంత సమయం ఇవ్వాలి. అతనో విధ్వంసక ఆటగాడు’’ అని పాంటింగ్‌ తెలిపాడు.