IND vs AUS T20 మ్యాచ్..ఆన్ లైన్ టికెట్లపై కీలక అప్డేట్

0
111

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ20పైనే అందరి దృష్టి నెలకొంది. దీనితో అభిమానులు టికెట్ల వేటలో పడ్డారు. నేడు జింఖానా మైదానంలో టికెట్ల విక్రయానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా టికెట్ల కోసం ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నేడు జింఖానా మైదానంలో టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈరోజు టికెట్లు అమ్ముడు పోయినట్లు HCA నిర్వాహకులు తెలిపారు. అయితే ఆన్ లైన్ టికెట్లు మాత్రం ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.